భీమవరం (ప్రకాశంచౌక్) : ప్రత్యేక ఓటర్ల జా బితా సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి స్వచ్ఛమైన, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. పట్టణంలోని చిగుడీలుపేట పద్మశాలీల బజార్ ప్రాంతంలో ఆదివారం ఆమె పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలపై ఓటర్లను ఆరా తీశా రు. డిజిటలైజేషన్‌పై బీఎల్‌ఓలను ప్రశ్నించా రు. ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ పనులను గడువులోపు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాంతంలో వీధి కుక్కలు అధికంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ వాటికి స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, బీఎల్‌ఓలు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్) : ఓటర్ల జాబితా ప్ర త్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమ రేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ ను వేగవంతంగా పూర్తి చేసి నూరు శాతం ల క్ష్యం సాధించాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. పట్టణంలోని 1, 2వ వార్డుల్లో ఆదివారం ఆయన పర్యటించి ఓటర్ల ఎన్యుమరేష న్, డిజిటలైజేషన్‌ను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఆరా తీశారు. ఎన్యుమరేషన్ ఫారాలను ప్రజలు పూర్తిగా నింపి వీలైనంత త్వరగా బీఎల్‌ఓలకు అందజేయాలని, తద్వారా సమ గ్ర, పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలని కోరారు. మెంటేవారితోట ప్రాంతంలో డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను గమించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ చెత్త సేకరణపై ఆరా తీశారు. తహసీల్దార్ రావి రాంబా బు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఎ.రాంబాబు, బీఎల్‌ఓలు ఉన్నారు.
భీమవరం: భీమవరం పట్టణంలో బంగ్లాదేశీయులు ఉన్నారా అనే విషయమై పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇత ర ప్రాంతాల నుంచి భీమవరం వచ్చి పనులు చేసుకుంటున్న వారి వివరాలను తెలుసుకున్నారు. పలువురిని పశ్చిమ బెంగాల్‌కు చెందినవారిగా గుర్తించారు. వన్‌టౌన్ సీఐ ఎ.రమేశ్, ఎస్సై కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యలమంచిలి : ఎంపీటీసీ సభ్యులకు 2024 నుంచి గౌరవ వేతనాలు రావటం లేదని, తొందరగా ఇప్పించాలని యలమంచిలి ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి ఆధ్వర్యంలో మండలంలోని ఎంపీటీసీ సభ్యులు ఆదివారం పాలకొల్లులో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో వైస్ ఎంపీపీలు గొల్లపల్లి శ్రీనివాసరావు, కొప్పాడి శ్రీనుబాబు, మాజీ ఎంపీపీ రావూరి వెంకటరమణ, ఎంపీటీసీ సభ్యులు కడలి సుబ్బలక్ష్మి, కంబాల సత్యశ్రీ, కడలి సునీత, మానుకొండ చిట్టెమ్మ, ఇసుకపల్లి శ్రీధర్ వర్మ, కంబాల తిరుమల వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు ఉన్నారు.
పెదవేగి: రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆల యానికి పలు రూపాల్లో రూ.1,32,165 ఆదా యం లభించిందని దేవస్థాన చైర్మన్ మన్నే శ్రీనివాసరావు తెలిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఈఓ నల్లూరి సతీష్‌కుమార్ పర్యవేక్షించారు.


