10న ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

10న ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

Jul 5 2026 7:38 AM | Updated on Jul 5 2026 7:38 AM

10న ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు టీచర్ల సమస్యలు పరిష్కరించాలి నేటి నుంచి డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు 11న జాతీయ లోక్‌అదాలత్‌

భీమవరం (ప్రకాశంచౌక్‌): నరసాపురం వైఎన్‌ డిగ్రీ కాలేజీలో ఈనెల 10న మెగా ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగ రాణి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో పోస్టర్‌ ను ఆవిష్కరించారు. సుమారు 21 ప్రముఖ, త దితర కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, 1,500కు పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. 18–35 ఏళ్ల వయసున్న అభ్యర్థులని, మరిన్ని వివరాలకు సెల్‌: 9502024765, 7330803719లో సంప్రదించాలని కోరారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంలోని పాతూరులో అధిక లోడ్‌ కారణంగా 12వ వార్డు కనకదుర్గమ్మ గుడి వద్ద విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ తరచూ ట్రిప్‌ అవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై గతనెల 11న ‘విద్యుత్‌ కోతలతో ఉక్కిరిబిక్కిరి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి విద్యుత్‌ అధికారులు స్పందించారు. ఇక్కడ ఇంప్రూవ్‌మెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుచేశారు. ఏపీఈపీడీసీఎల్‌ తాడేపల్లిగూడెం డివిజన్‌ ఈ ఈ నరసింహమూర్తి మాట్లాడుతూ ఇంప్రూ వ్‌మెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పనిచేయడం ప్రారంభించిందని, తరచూ ట్రిప్‌ అయ్యే సమస్యలు ఉండవని చెప్పారు.

వీరవాసరం: మండలంలోని పలు హైస్కూళ్లను ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో చైర్మన్‌ లంకలపల్లి సాయి శ్రీనివాస్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని, 12వ పీఆర్సీని వెంటనే నియ మించాలని, నాలుగు డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని డి మాండ్‌ చేశారు. లేకుంటే ఈనెల 14న ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద పికెటింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కెవీ రామచంద్రరావు, మండల అధ్యక్ష ప్రధా న, కార్యదర్శులు సత్యనారాయణ, దగ్గుమిల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో ఆదివారం నుంచి జరుగనున్న డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు డీఆర్వో పి.ప్రభాకర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. భీమవరం డీఎన్నార్‌, తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారని, ఆదివారం, 8, 9 తేదీల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ఏపీపీఎస్సీ సెక్షన్‌ అధికారి కె.భాస్కర్‌రావు పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఈనెల 11న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి తెలిపారు. శనివారం జిల్లా కోర్టు భవనంలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకూ 10,003 రాజీయోగ్యమైన కేసులు గుర్తించామని, ఆయా కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. రాజీమార్గంలో కేసుల పరిష్కారానికి కక్షిదారులు సహకరించాలని కోరారు. మార్చిలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 9,530 కేసులను రాజీ చే సినట్టు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఆన్‌లైన్‌ ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని, స మస్యలు ఉంటే 08812 224555 లేదా 15100 ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement