అల్లూరి జీవితం ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

అల్లూరి జీవితం ఆదర్శనీయం

Jul 5 2026 7:38 AM | Updated on Jul 5 2026 7:38 AM

భీమవరం (ప్రకాశంచౌక్‌): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆదర్శనీయమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూ పతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శనివారం స్థానిక అల్లూరి స్మతివనంలో 30 అడుగుల కాంస్య విగ్రహం వద్ద అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించి డిజిటల్‌ స్క్రీన్‌ను ప్రారంభించారు. డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి మాట్లాడుతూ అల్లూరి జీవితం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడారు. అనంతరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. చిన్నారులు అల్లూరి వేషధారణలతో ఆకట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు అందించారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఉద్దరాజ విశ్వనాథరాజు, గాదిరాజు సుబ్బరాజు, కంతేటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement