యలమంచిలి ఎంఈఓపై విచారణ | - | Sakshi
Sakshi News home page

యలమంచిలి ఎంఈఓపై విచారణ

Jul 5 2026 7:38 AM | Updated on Jul 5 2026 7:38 AM

యలమంచిలి ఎంఈఓపై విచారణ

యలమంచిలి: యలమంచిలి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)గా ఇటీవల వరకు పనిచేసిన అవిడి శ్రీవాణిపై వేధింపులు, అవినీతి ఆరోపణలు రావడంతో విద్యాశాఖ ఆర్జేడీ నాగమణి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం డీవైఈఓ కేవీఎస్‌ రామాంజనేయులు శనివారం విచారణ చేశారు. యలమంచిలిలిలోని ఎంఈఓ కార్యాలయంలో ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది, పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్లు సుమారు 50 మంది వరకు హాజరయ్యారు. శ్రీవాణి ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బందితో అమానవీయంగా వ్యవహరించడం, చులకనగా చూడటం, ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, విధి నిర్వహణలో కక్ష సాధింపు, బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. మహిళా సిబ్బంది ఎంఈఓ వేధింపులను వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ మంజూరు కోసం సంతకాలు చేసేందుకు ఇబ్బందులు పెట్టారని రిటైర్డ్‌ ఉద్యోగులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement