నాటకం.. ఆలోచనాత్మకం | - | Sakshi
Sakshi News home page

నాటకం.. ఆలోచనాత్మకం

Jul 5 2026 7:38 AM | Updated on Jul 5 2026 7:38 AM

నాటకం.. ఆలోచనాత్మకం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : హేలాపురి కళాపరిషత్‌ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 18వ స్మారక జాతీయ స్థాయి నాటిక పోటీలు శనివారం స్థానిక వైఎంహెచ్‌ఏ హాలులో ప్రా రంభమయ్యాయి. తొలి రోజు రెండు ప్రదర్శనలు ఆలోచనాత్మకంగా సాగాయి. అభినయ ఆర్ట్స్‌ (గుంటూరు) కళాకారులు సహానా నా టిక ప్రదర్శించారు. ప్రపంచంలో బతకాలంటే సమస్యలతో, సంఘటనలతో జతకట్టి వాటిని ప్రతిఘటిస్తూ ముందుకు సాగాలనే సందేశమిస్తూ నాటిక సాగింది. అనంతరం అరవింద ఆర్ట్స్‌ (తాడేపల్లి) కళాకారులు దేవుణ్ణి చూసా నాటిక ప్రదర్శించారు. కనిపించే మనుషుల్లోనే దేవుణ్ణి చూడాలనే సందేశంతో ఈ నాటిక సాగింది. తొలుత నిర్వహించిన సభా కార్యక్రమంలో ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ జి. పాండురంగారావు, వైఎంహెచ్‌ఏ అధ్యక్షు డు యర్రా సోమలింగేశ్వరరావు, హేలాపురి కళాపరిషత్‌ అధ్యక్షుడు పెదపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement