తణుకు అర్బన్: రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని యువకుడు మృతిచెందిన ఘటన శనివారం తణుకు మండలం వేల్పూరు రైల్వేస్టేషన్‌న్ సమీపంలో చోటు చేసుకుంది. సుమారు 25 ఏళ్ల వయసు ఉన్న యువకుడు గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని రైల్వే పోలీసులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కుడి చేతిపై అమ్మ అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉన్నట్లు చెబుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


