కారు ఢీకొని వ్యక్తికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యక్తికి గాయాలు

Jul 5 2026 7:38 AM | Updated on Jul 5 2026 7:38 AM

తణుకు అర్బన్‌: తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయపడ్డాడు. గుంటూరు నుంచి వాడపల్లి వెళుతున్న కారు హైవేపై షర్మిష్ట జంక్షనన్‌ వద్దకు వచ్చే సరికి అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ సమయంలో ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన వ్యక్తి సైకిల్‌ వస్తుండగా అతన్ని ఢీకొట్టి డివైడర్‌ పైకి ఎక్కింది. ప్రమాదంలో వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తణుకులోని ప్రెవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పట్టణ పోలీసులను ఆరాతీయంగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తణుకు పట్టణ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement