మద్ది ఆంజనేయస్వామికి రూ.2.08 లక్షల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

మద్ది ఆంజనేయస్వామికి రూ.2.08 లక్షల ఆదాయం

Jul 5 2026 7:38 AM | Updated on Jul 5 2026 7:38 AM

మద్ది ఆంజనేయస్వామికి రూ.2.08 లక్షల ఆదాయం

జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం ఆలయ ప్రాకార మండపంలో అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. శనివారం సాయంత్రం వరకు వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ. 2,08,267 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాజాన సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. కాగా, నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1,897 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్‌ రాజాన సత్యనారాయణ, ఈవో ఆర్‌.వి.చందన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement