జననేతకు నీరాజనం
న్యూస్‌రీల్
జన తరంగం ఎగసింది.. అభిమాన నేతను చూసి మురిసింది.. సంక్షేమ ప్రదాతకు ఆత్మీయ స్వాగతం పలికింది.. అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది.. ‘సీఎం.. సీఎం.. జై జగన్’ నినాదాలతో హోరెత్తించింది.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వెల్లువలా వచ్చిన జనకెరటం జననేతకు నీరాజనాలు అర్పించింది.. యువత, అభిమానుల కేరింతలు, ఉత్సాహం నడుమ భీమవరం జనసంద్రాన్ని తలపించింది. వివాహ వేడుకకు హాజరైన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
8లో u
శురకవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సాక్షి, భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్): శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు కుమారుడు ఐపీఎస్ అధికారి చిట్టిరాజు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గొర్రెముచ్చు కిషోర్‌కుమార్ కుమార్తె తేజ రిషితల వివాహం గురువారం పెద అమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాలులో వైభవంగా జరిగింది. నూతన జంటను ఆశీర్వదించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు భీమవరం చేరుకున్నారు. ఉదయం నుంచే జువ్వలపాలెం, క న్వెన్షన్ హాలు రోడ్లలో హడావుడి మొదలైంది. పార్టీ శ్రేణులు, యువత పార్టీ జెండాలు, జగన్ ఫ్లెక్సీలతో సందడి చేశారు. దారిపొడవునా ఫ్లెక్సీలతో రోడ్డును ముంచెత్తారు. ఉదయం 11.30 గంటలకు పెద అమిరం రోడ్డులోని హెలీప్యాడ్‌కు జగన్ చేరుకోగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నేతలు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హెలీప్యాడ్ నుంచి కల్యాణవేదిక వరకూ పార్టీ శ్రేణులు, యువతతో రోడ్డు కిక్కిరిసిపోయింది. భారీ ఎత్తున బాణాసంచా కాల్పులతో అధినేతకు పార్టీ వ్రేణులు స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను దగ్గరగా చూసేందుకు యువకులు బారికేడ్లు, ప్రహరీ గోడలను లెక్కచేయకుండా కాన్వాయ్ వెంట పరు గులు తీశారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి హెలీప్యాడ్ నుంచి తిరుగు పయనమయ్యే వరకూ జగన్‌ను చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబర్చారు.
కిక్కిరిసిన కన్వెన్షన్
కల్యాణ వేదిక వద్ద మోషేన్‌రాజు, అన్నామణి దంపతులు వైఎస్ జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. వధూవరులు చిట్టిరాజు, తేజ రిషితలను జగన్ ఆశ్వీరించారు. వేదిక వద్ద జగన్‌ను చూసేందుకు జనం పోటీపడ్డారు. ఆయన వధూవరులను ఆశీర్వదిస్తున్న దృశ్యాలను చిన్నాపెద్దా తేడాలేకుండా సోఫాలు, కుర్చీలు ఎక్కీ మరీ తమ సెల్‌ఫోన్లలో బంధిస్తూ మురిసిపోయారు. అభిమా న నేతతో కరచాలనం కోసం పోటీపడ్డారు.
భీమవరం.. అభిమాన సంద్రం
వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
మండలి చైర్మన్ మోషేన్‌రాజు తనయుని వివాహ వేడుకకు హాజరు
పెదఅమిరం రోడ్డులో ప్రభంజనం
ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి వెల్లువలా పార్టీ శ్రేణులు
జననేతకు నీరాజనం
జననేతకు నీరాజనం
జననేతకు నీరాజనం
జననేతకు నీరాజనం


