మూడు బార్ల కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

మూడు బార్ల కేటాయింపు

Feb 6 2026 8:38 AM | Updated on Feb 6 2026 8:38 AM

మూడు

మూడు బార్ల కేటాయింపు

మూడు బార్ల కేటాయింపు ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు అప్సడా రిజిస్ట్రేషన్‌ వేగిరపర్చాలి స్కూల్‌ బస్సు బోల్తా హెల్త్‌ అసిస్టెంట్లకు నియామక పత్రాలు

భీమవరం: జిల్లాలో మద్యం బార్‌ల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రాని పరిస్థితి. నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెంలో 8 బార్లు ఏర్పాటుకు గురువారం లాటరీ నిర్వహించగా మూడు బార్లకు మాత్రమే కేటాయింపులు జరిగాయి. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి లాటరీ ద్వారా బార్లను కేటాయించారు. నరసాపురం, తణుకు పరిధిలో జనరల్‌ కేటగిరీలో బార్లకు లాటరీ తీసి నరసాపురం బార్‌ను అంగర వరప్రసాద్‌కు కేటాయించారు. రిజర్వ్‌ వన్‌ అండ్‌ టు అభ్యర్థులుగా శ్రీరామకృష్ణ, బొలిశెట్టి నాగ వెంకట సత్యనారాయణ ఎంపికయ్యారు. తణుకు పరిధిలో రెండు బార్లకు రెడ్డి వీర వెంకటరత్నం, జుజ్జువరపు సత్యనారాయణ ఒక్కొక్కరు నాలుగు దరఖాస్తులు చేయడంతో వారిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. తాడేపల్లిగూడెంలో నాలుగు, తణుకులో ఒక బార్‌కు ఎవరు దరఖాస్తు చేయలేదని కలెక్టర్‌ చెప్పారు. డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, జిల్లా ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ శాఖ అధికారి ఆర్‌వీ ప్రసాద్‌ రెడ్డి, సీఐలు కె.బలరామరాజు, కళ్యాణ్‌ చక్రవర్తి, రమేష్‌, మణికంఠ రెడ్డి, స్వరాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

భీమవరం: టెన్త్‌, ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఫీజులు చెల్లింపునకు రూ.1,000 పెనాల్టీతో ఈనెల 12 వరకు గడువు పొడిగించినట్టు డీఈఓ ఈ.నారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చిలో నిర్వహించే పరీక్షల ఫీజు చెల్లింపునకు, ఎస్‌ఆర్‌ డేటా ఆన్‌ లైన్‌కు 12 వరకు గడువు ఇచ్చామన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్‌ను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. భీమవరంలో క్యాంపు కార్యాలయం నుంచి గురువారం అ ప్సడా రిజిస్ట్రేషన్ల ప్రగతిపై మండలాల వారీగా గూగుల్‌ మీట్‌ ద్వారా సమీక్షించారు. ప్రక్రియను ఈనెల 10లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌లో వెనుకబడిన గణపవరం, వీరవాసరం, ఆకివీడు, పాలకొల్లు మండలాల ఎంపీడీఓలు, ఎఫ్‌డీఓలతో మాట్లాడారు. శ్రద్ధ చూపని రైతులకు నోటీసులు ఇచ్చి అవగాహన కల్పించాలన్నారు. మత్స్యశాఖ జేడీ సురేష్‌, సహాయ సంచాలకుడు ఎల్‌ఎల్‌ఎన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

చాట్రాయి: మండలంలోని గుడిపాడులో ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట సిద్ధార్థ స్కూల్‌, కాలేజీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబో యి రోడ్డు పక్కనున్న పంట బోదెలోకి బోల్తా కొ ట్టింది. దీంతో బస్సులోని ఎనిమిది మంది వి ద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా ఒక విద్యార్థినికి పళ్లు కదిలి ఊడిపోయాయి. క్షతగ్రాతులను విస్సన్నపేటలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటన విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై డి.రామృష్ణ తెలిపారు. వేగంగా బస్సులు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.

ఆకివీడు: పోరాట ఫలితంగా ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లు ఎట్టకేలకు విధుల్లోకి హాజరయ్యారు. అనర్హులుగా ఉన్నారని కొందరు కోర్టుకు వెళ్లడంతో 2024 డిసెంబర్‌ 5న వీరిని తొలగించారు. రాష్ట్రవ్యాప్తంగా బాధితులంతా సుప్రీంకోర్టుకు వెళ్లారు. గ్రూప్‌ ఆఫ్‌ మినిస్ట్రీస్‌ ద్వారా నియమించిన పో స్టులు కావడంతో వీరిని తొలగించడానికి హక్కు లేదని, పోస్టులు తిరిగి ఇవ్వాలని మూడు నెలల క్రితం కోర్టు తీర్పు ఇచ్చింది. తమ అర్హతలను నిరూపించుకోవడంతో కోర్టు తీర్పు ప్రకారం ఉమ్మడి జిల్లా డీఎంహెచ్‌ఓ అమృత చేతులమీదుగా 41 మంది బుధవారం రాత్రి జాయినింగ్‌ ఆర్డర్లు అందుకున్నారు. వీరిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 21 మంది విధుల్లో చేరేలా గురువారం భీమవరంలో డీఎంహెచ్‌ఓ గీతాబాయి అనుమతులు ఇచ్చారు.

మూడు బార్ల కేటాయింపు 
1
1/1

మూడు బార్ల కేటాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement