టీడీపీ అరాచకాలకు భయపడం
మాజీ మంత్రుల కుటుంబాలకు జిల్లా నేతల పరామర్శ
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు నాయకుడు అంబటి రాంబాబుపై దాడి, ఇల్లు, కార్యాలయాలపై దాడు లు, విధ్వంసం చేసిన టీడీపీ గుండాలపై ప్ర భుత్వం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన పార్టీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు, నూజివీడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అ ప్పారావు, ఏలూరు కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) పార్టీ నేతల బృందం గురువా రం అంబటి కుటుంబాన్ని పరామర్శించారు. దాడుల ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పించారు. ధ్వంసమైన కారు, ఇంటి పరిసరా లు, కార్యాలయాన్ని పరిశీలించారు. పార్టీ నేత లు మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయలేని చంద్రబాబు ప్రభుత్వం శ్రీవారి ల డ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనే ఆ రోపణలు చేసిందని, అయితే సీబీఐ, సిట్ నివేదికతో సీఎం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చేసిన ఆరోపణలు అవాస్తవాలు అని తేలిందన్నారు. అలాగే ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.


