సా..గుతున్న రబీ
న్యూస్‌రీల్
నరసన్న కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసన్న కల్యాణోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. 8లో u
శనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026
సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమలో రబీ సాగు జాప్యమవుతోంది. ఖరీఫ్ కలిసిరాక, ప్రభుత్వం సహకారం అందక దాళ్వా పనులు నత్తనడకన జరుగుతున్నాయి. సాగు చివరిలో నీటి ఎద్దడి రాకుండా డిసెంబరు నెలాఖరవు నాటికి నాట్లు పూర్తిచేయాల్సి ఉండగా జనవరి ముగుస్తున్నా ఇంకా సాగుతూనే ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని 2.25 లక్షల ఎకరాలు, ఏలూరు జిల్లాలో 80 వేల ఎకరాల్లో రైతులు రబీ సాగు చేస్తున్నారు. మున్ముందు ఎండల తీవ్రత, నీటి ఎద్దడితో పంటకు నష్టం కలుగకుండా సకాలంలో సాగు పూర్తిచేసేందుకు డిసెంబరు నెలాఖరు నాటికి నాట్లు పూర్తిచేయాలని, వెదజల్లు పద్ధతిని అవలంభించే వారు డిసెంబరు మొదటి వారంలోపు విత్తుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు గతంలోనే సూచించారు.
కలిసిరాని ఖరీఫ్ : సాగునీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ ఆలస్యమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 4.01 లక్షల ఎకరాల్లో తొలకరి సాగు చేయగా పంట పాలుపోసుకునే, గింజ గట్టిపడే కీలక దశల్లో మోంథా తుపాను తీవ్ర నష్టం కలిగించింది. స్వర్ణ, సంపద స్వర్ణ సాగుచేసిన పొలాల్లో పంట నేలకొరిగింది. ఎంటీయూ 1318, పీఎల్‌ఏ 1100, తదితర రకాల్లో తాలు గింజలు పెరిగి దిగుబడులు తగ్గిపోయాయి. పశ్చిమలోని ఆకివీడు, నరసాపురం, భీమవరం, పెంటపాడు, మొగల్తూరు తదితర మండలాల్లోని 25 వేల ఎకరాలు, ఏలూరులోని ఉంగుటూరు, దెందులూరు, చింతలపూడి తదితర చోట్ల సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఖరీఫ్‌లో ఎకరాకు సగటున 26.25 క్వింటాళ్లు చొప్పున దిగుబడి రావాల్సి ఉండగా తుపాను ప్రభావంతో 21 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఎకరాకు 5.25 క్వింటాళ్ల దిగుబడి తగ్గిపోయింది. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,369లు మేరకు ఒక్కో ఎకరాకు రూ.12,437లు వరకు నష్టపోయి పెట్టుబడులు దక్కని దుస్థితి ఎదురైంది.
మరో 20 వేల ఎకరాల్లో..
పశ్చిమలో ఇప్పటివరకు రెండు లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తికాగా మరో 20 వేల ఎకరాల్లో జరగాల్సి ఉంది. ముందుగా రబీ నాట్లు వేసిన తాడేపల్లిగూడెం రూరల్ తదితర ప్రాంతాల్లో వరి పంట దుబ్బు చేస్తుండగా యలమంచిలి, ఆచంట, నరసాపురం తదితర చోట్ల ఇంకా నాట్లు జరుగుతున్నాయి. ఈ సీజన్‌లో అధిక శాతం విస్తీర్ణంలో 120 నుంచి 125 రోజులు సాగుకాలం కలిగిన వంగడాలు సాగవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఏప్రిల్ నెలాఖరు, మే మొదటి వారం వరకూ సాగు జరిగే అవకాశం ఉందని అంచనా. సాగు చివర్లో ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన నాట్లు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
జనవరిలోనూ నాట్లు
దాళ్వా సాగు ఆలస్యం
రైతులకు నష్టాలు మిగిల్చిన ఖరీఫ్
సాయం అందించని ప్రభుత్వం
రబీ పెట్టుబడులకు సతమతం
ఉమ్మడి జిల్లాలో 3.15 లక్షల ఎకరాల్లో సాగు
దాళ్వా సాగు (ఎకరాల్లో)
జిల్లా విస్తీర్ణం
పశ్చిమగోదావరి 2.25 లక్షలు
ఏలూరు 80 వేలు
సా..గుతున్న రబీ


