గూడెం విమానాశ్రయంపై కదలిక
జాతరకు పటిష్ట ఏర్పాట్లు
ఏలూరు పడమరవీధిలో గంగానమ్మవారి జాతర మహోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. 8లో u
తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో ఏర్పాటుచేయబోయే నాలుగు కొత్త విమానాశ్రయాలపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయడంతో తాడేపల్లిగూడెం విమానాశ్రయ ఏర్పాటుపై కదలిక వచ్చింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల్లో భూసేకరణ చేసి విమానాశ్రయం ఏర్పాటు చేస్తారని ప్రచారం ఉంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో భూపరిశీలన చేశారు. రెండు, మూడు నెలల క్రితం ఈ ప్రతిపాదన హల్‌చల్ చేసినా, తర్వాత ఆగిపోయింది. తాజా ప్రకటనతో గూడెం విమానాశ్రయం ఏర్పాటుపై మరలా చర్చ ప్రారంభమైంది. గూడెంలో కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై అధ్యయనం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్ మో హోల్ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. వి మానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన స్థల వివరాలను ఎయిర్‌పోర్టు అఽథారిటీ ఆఫ్ ఇండి యాకు ప్రభుత్వం అందజేసినట్టు తెలిసింది.


