ఉద్యాన పంటలకు ప్రోత్సాహం
ఏలూరు(మెట్రో): రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్‌గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్థానిక చింతలపూడి రోడ్డులోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాలులో శుక్రవారం రాష్ట్రస్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోకో పంట విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు తక్కువ ఖర్చు తో నాణ్యమైన కోకో ఉత్పత్తి, సాగులో మెలకువలు, మార్కెటింగ్ సౌకర్యాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించడమే ఈ కాంక్లేవ్ ఉద్దేశమన్నారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 44,984 ఎకరాల్లో కోకో సాగవుతుందని, అదనంగా 1,200 హెక్టార్లలో పంట సాగుచేసేలా రైతులు శిక్షణ ఇచ్చా మన్నారు. ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమా ర్, పత్సమట్ల ధర్మరాజు మాట్లాడారు. కోకో పంటకు సంబంధించి కరపత్రాలు విడుదల చేశారు.
కోకో బోర్డు కోసం వినతి
ఏలూరు (టూటౌన్): కోకో బోర్డు, కోకో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని, కోకో గింజలకు ధరల పాలసీ ప్రకటించాలని కోరుతూ ఏపీ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి అచ్చెన్నాయుడుకు వినతిపత్రం అందించారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కోకో రైతులు సాగులో కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారని ఆదుకోవాలని కోరారు.


