విష ప్రచారం పటాపంచలు
వీరవాసరం: తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కూటమి నేతలు చేసిన విష ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో స్పష్టం చేసినట్టు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ని జాలు తెలిసినా ఇప్పటికీ అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నామన్నారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు ఘోర అపచారాలను ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): అప్సడా రిజిస్ట్రేషన్ ద్వారా ఆక్వా రైతులకు కలిగే ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి సూచించారు. స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం అప్సడా రిజిస్ట్రేషన్, గృహ నిర్మాణాల ప్రగతి, ఈపీటీఎస్ ఫైల్స్ అప్‌లోడ్ అంశాలపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో 1,31,436 ఎకరాల్లో ఆక్వా సాగు ఉండగా ఇప్పటివరకు 66,340 ఎకరాలు అప్సడాలో రిజిస్ట్రేషన్ అయ్యాయన్నారు. ఫిబ్రవరి 10 నాటికి నూరు శాతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించాలని ఆదేశించారు. రానున్న ఉగాది నాటికి జిల్లాలో 9,135 గృహాలను లబ్ధిదారులకు అందించాల్సి ఉందని, ఈ మేరకు పనులు పూర్తిచేయాలన్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే ఉపేక్షించేది లేదని డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి హెచ్చరించా రు. కలెక్టరేట్‌లో శుక్రవారం డీఆర్వో అధ్యక్షతన గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టం అమలుపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ వైద్యారోగ్యశాఖ అధికారులు తరచూ స్కానింగ్ కేంద్రాలపై తనిఖీలు చేయాలన్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ జిల్లాలో 42 డెకాయ్ ఆపరేషన్లు జరిగాయన్నారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. డీఎంహెచ్‌ఓ జి.గీ తాబాయి, పట్టణ సీఐ నాగరాజు, కమిటీ సభ్యులు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఎంఎస్‌వీఎస్ బద్రిరాజ్, జిల్లా జడ్జి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: మహాత్ముడి పేరు లేకుండా ఉపాధి హామీ చట్టాన్ని మార్చిన ఘనుడు ప్రధాని మో దీ అని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గో పాలన్ అన్నారు. పేదలకు ఉపాధి గ్యారెంటీ లేకుండా చేసే వీబీజీ రాం జీ చట్టం తీసుకువచ్చారని, దీనిని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి గ్యారెంటీ చూపిస్తూ పట్టెడన్నం పెడుతున్న చట్టాన్ని మార్పు చేయడం దుర్మార్గమన్నారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఏలూరు (టూటౌన్): జిల్లా పరిధిలో బాలల సంరక్షణ కేంద్రాల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించినట్టు జిల్లా పర్యవేక్షణాధికారి టి.జ్యోతి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు జ్యోతి 7780399779, జిల్లా బాలల సంరక్షణ అధికారి సీహెచ్ సూర్యచక్రవేణి సెల్ 89191 60257 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (బ్రిడ్జ్‌కోర్సు, ఆన్‌జాబ్ ట్రైనింగ్) విద్యార్థులకు ప్రాక్టికల్స్ శుక్రవారం కొనసాగాయి. ఏలూరు జిల్లాలోని 34 కేంద్రాల్లో ఉదయం 2,320 మందికి 2,286 మంది, మధ్యాహ్నం 2,502 మందికి 2,457 మంది హాజరయ్యారు.
విష ప్రచారం పటాపంచలు


