అధ్వానంగా డ్రెయిన్లు
న్యూస్‌రీల్
ఇరిగేషన్ మంత్రి ఉన్నా ఫలితం శూన్యం
పట్టించుకోని అధికారులు
వేసవిలో పూడికతీత పనులు చేస్తాం
గ్రావెల్ లారీల పట్టివేత
అక్రమ మార్గంలో గ్రావెల్ రవాణాకు పాల్పడుతున్న లారీలను విజిలెన్స్ అధికారులు తేతలిలో అదుపులోకి తీసుకున్నారు. అపరాధ రుసుం వసూలు చేశారు. 8లో u
రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడుకు గత ప్రభుత్వంలో మంజూరైన బైపాస్ రోడ్డు నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. 8లో u
గురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2026
భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న డ్రెయిన్లు(మురుగు కాలువలు) అధ్వానంగా మారాయి. గట్లు జారిపోవడం, చెత్త డంప్ చేయడం, డ్రెయిన్లలో మట్టిమేటలు, పిచ్చి మొక్కలు పెరిగి దారుణంగా ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు డ్రెయిన్ ఉందా లేదా అన్నట్లు చెట్లు, మొక్కలు కప్పేశాయి. దాంతో మురుగు నీరు ముందుకు కదలడం లేదు. పల్లెలు మొదలుకుని పట్టణాల మీదగా ప్రవహించే మురికి కాలువలు అడుగడుగునా అధ్వానంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద డ్రెయిన్లదీ అదే పరిస్థితి.
ముంపునకు గురవుతున్న పొలాలు
ప్రతి ఏటా వర్షాకాలంలో భారీ వర్షాలకు వ రిపొలాలు నీట మునిగిన సమయంలో ముంపు నీరు మురుగు కాలువల ద్వారా వేగంగా బయటకు వెళ్లే మార్గం లేకుండా డ్రెయిన్లు పూడికపోయాయి., చెత్తచెదారం అడ్డు పడడంతో వందల ఎకరాల పంట ముంపులోనే ఉండిపోయి పంట దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు.
ఆక్రమణలకు గురై చిక్కిపోతున్న డ్రెయిన్లు
జిల్లాలోని అనేక డ్రెయిన్లు చిక్కిపోతున్నాయి. అక్రమణలకు గురికావడం. కొన్ని చోట్ల కాలువ గట్లు బలహీన పడి గట్లు కాలువలోకి జారి పూడుకుపోవడం జరుగుతోంది. అనేక చోట్ల డ్రెయిన్లు గట్ల ఆక్రమణలకు గురై చిక్కిపొతున్నాయి. గ్రామాల పరిధిలోని డ్రెయిన్ గట్లను అక్రమించి రొయ్యల చెరువులు తవ్వి సాగు చేస్తున్నారు. రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు గట్లు అక్రమించి పూడ్చి ప్లాట్లు వేస్తున్నారు. పట్టణాల్లో డ్రెయిన్లు అక్రమించి భవనాల నిర్మాణం, దుకాణాలు ఏర్పాటు చేసి డ్రెయిన్లు వెడల్పూ లేకుండా చేస్తున్నారు.
చెత్త డంపింగ్
జిల్లాలో ఏ డ్రెయిన్ చూసినా చెత్తచెదారంతో కనిపిస్తుంది. దాంతో క్రమేపీ డ్రెయిన్లు పూడుకుపోతున్నాయి. వరదల సమయంలో నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలిగి అనేకచోట్లు గండ్లు పడే పరిస్థితి ఏర్పడింది. భీమవరంలో యనమదుర్రు డ్రెయిన్, తణుకు నుంచి పాలకోడేరు మండలంలో యనమదుర్రులో కలిసే గోస్తనీ నది చెత్తచెదారంతో నిండిపోయాయి.
ఈ వేసవిలోనైనా బాగుచేస్తారా?
ఈ వేసవిలో డ్రెయిన్ల పూడిక తీత పనులు చేస్తారా లేదా అన్న అనుమానమే.. అధికారులు రూ.12 కోట్లతో 30 డ్రెయిన్ల పనులకు ప్రతిపాదనలు పెట్టారు. ఇంతవరకు నిధులు మంజారు చేయలేదు.. మరి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందా లేదా వేచి చూడాలి..
అధ్వానంగా పెనుగొండలో నక్కల డ్రెయిన్
పెనుమంట్రలో గోస్తనీ నది దుస్థితి
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల కాలంలో జిల్లాలో డ్రెయిన్ల అభివృద్ధికి చేసిందేమీ లేదు. జిల్లాలోనే ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నా ఫలితం శూన్యం. ఆయన కేవలం తన నియోజకవర్గంలోని డ్రెయిన్లు బాగుచేయించి జిల్లాలో అధ్వానంగా డ్రెయిన్ల గురించి గాని పంట నష్టపోతున్న రైతులు గురించి గాని పట్టించుకునే దాఖాలు లేవు.
ప్రతి డ్రెయిన్ ఆక్రమణకు గురయ్యిందని, మురుగు నీళ్లు బయటకు వెళ్లకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. వాటి గురించి డ్రెయినేజి అధికారులు గాని స్థానిక రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా డ్రెయినేజీ అధికారులు చర్యలు తీసుకుని డంప్ యార్డు ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవడం లేదు.
పూడిక, ఆక్రమణలతో కుచించుకుపోతున్న వైనం
ముంపు నీరు ముందుకు కదలక పొలాల మునక
ఈ వేసవిలో డ్రెయిన్ల మరమ్మతులకు వినతి
జిల్లాలో మేజర్ డ్రెయిన్లు 30
మైనర్ డ్రెయిన్లు 50 నుంచి 100
డ్రెయిన్ల మొత్తం పొడవు 500 కిలోమీటర్లు
జిల్లాలో డ్రెయిన్లు పూడికతీత పనులకు సంబంధించి 30 పనులకు రూ.12 కోట్లకు ప్రతిపాదనలు పంపాం. ఈ వేసవిలో డ్రెయిన్ల అభివృద్ధి పనులు చేస్తాం. కొన్ని డ్రెయిన్లలో తూడు తొలగింపు పనులు చేశాం.
సీహెచ్ సత్యనారాయణ,
డ్రెయినేజి ఈఈ, భీమవరం
అధ్వానంగా డ్రెయిన్లు
అధ్వానంగా డ్రెయిన్లు
అధ్వానంగా డ్రెయిన్లు
అధ్వానంగా డ్రెయిన్లు


