రిపబ్లిక్ డే వేడుకల్లో అవార్డు
భీమవరం అర్బన్: ఈ నెల 26న ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో సీ్త్ర శిశు మహిళ సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి చేతుల మీదుగా రాయలం అంగన్‌వాడీ టీచర్ సీహెచ్ మహాలక్ష్మీ ఉత్తమ టీచరుగా అవార్డు అందుకున్నారు. గత నెలలో తనకు ఆహ్వానం అందిందని మహాలక్ష్మీ తెలిపారు.
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని బుధవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో లెక్కించారు. 20 రోజులకు నగదు రూపేణా రూ. 2,24,23,765 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 174 గ్రాముల బంగారం, 3.594 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఒకటికి బదులుగా జనవరి 31న అందజేస్తామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లాలో 2,24,521 మందికి పింఛన్లు అందించనున్నట్లు తెలిపారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో అవార్డు


