హెల్మెట్‌తో ప్రాణ రక్షణ
భీమవరం: హెల్మెట్, సీటు బెల్టు తప్పక ధరించాలని, రోడ్డు భద్రత ఒక్కరోజుకు పరిమితం కాకూడదని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. జాతీయ భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు.


