శ్రీవారి క్షేత్రంలో అమావాస్య ఎఫెక్ట్
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీపై గురువారం అమావాస్య ఎఫెక్ట్ చూపింది. కార్తీకమాస పర్వదినాలను పురస్కరించుకుని గత నెలరోజులుగా స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అమావాస్య కావడంతో గురువారం ఆలయానికి భక్తుల రాక స్వల్పంగా ఉంది. దాంతో మధ్యాహ్నం ఆలయ పరిసరాల్లో నామమాత్రంగా భక్తులు సంచరించారు. ఆ తరువాత నుంచి దాదాపుగా అన్ని విభాగాలు ఖాళీగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అనివేటి మండపం, ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లు, కల్యాణ కట్ట తదితర విభాగాలు భక్తుల లేమితో వెలవెలబోయాయి.


