
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
పాలకోడేరు: అత్తిలి మండలం ఆరవల్లి గ్రామానికి చెందిన సత్తి దుర్గారెడ్డి(29)కి చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతి చెందడంతో తన మేనమామ సబిళ్ళ శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద ఉంటున్నాడు. గల్ఫ్ దేశం వెళ్లాలని కోరిక ఉన్నా.. ఆర్ధిక ఇబ్బంది ఉండడంతో.. పాలకోడేరు మండలం మోగల్లులో రొయ్యల చెరువు వద్దకు వచ్చి శనివారం సాయంత్రం కలుపు మందు తాగి అపస్మారక స్థితి లోకి వెళ్లాడు. స్థానికులు స్పందించి భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తణుకు అర్బన్: విజయవాడలోని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్ కళాయజ్ఞ ఆధ్వర్యంలో శ్రీశ్రమైక జీవన సౌందర్యం్ఙ అంశంపై రాష్ట్ర స్థాయి చిత్రకళా ప్రదర్శనలో భాగంగా ఆదివారం నిర్వహించిన సెమినార్‌లో తణుకుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు చిత్రించిన ఉడ్ డిజైనర్ చిత్రం పలువురి ప్రశంసలు అందుకుంది. రాష్ట్రస్థాయిలో 40కి పైగా చిత్రకారులు పాల్గొని శ్రామికుల్ని వారి శ్రమని హృద్యంగా చిత్రాలుగా మలిచి ప్రదర్శించారని వెంపటాపు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పురస్కారం అందజేశారు.
దెందులూరు: కొవ్వలి కొత్తపేట రామాలయం సమీపంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా రోడ్డుపై పందిరి వేయడానికి అభ్యంతరం చెప్పడంతో తనను, తన కొడుకును కరల్రతో కొట్టి గాయపరిచారని మాకిన పెద్దిరాజు, మాకిన నాగేంద్రబాబు తెలిపారు. పందిరి కొంచెం పక్కన వేయండి లేదా ఖాళీగా స్థలంలో వేయమని చెప్పడంతో ఆగ్రహించిన మాకా నందు, మాకా వంశీ కరల్రతో దాడి చేశారన్నారు. బాధితులకు ఏలూరు ఆసుపత్రిలో చికిత్స అందించారు.
భీమవరం: భీమవరం ఒకటో పట్టణం తాడేరు రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై ఎస్.వి.వి.ఎస్ కృష్ణాజీ తెలిపారు. తాడేరుకు చెందిన ఎ.జగన్మోహనరావు(58) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. రాత్రి 8.30 గంటలకు ఇంటికి వెళ్తుండగా ఇందిరమ్మకాలనీకి సమీపంలో గోవులు అడ్డురావడంతో ద్విచక్రవాహనంతో పక్కన ఉన్న వరి పొలంలో పడిపోయారు. ముఖం మట్టిలో కూరుకుపోవడంతో గాయాలై మృతి చెందాడని, అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య