
త్రుటిలో తప్పిన ప్రమాదం
పెనుమంట్ర: భీమవరం ఆర్టీసీ డిపో బస్సు వెనుక టైరు యాక్సిల్ రాడ్ విరిగి బయటకు వచ్చింది. దీంతో బస్సు ఒకసారి ఒరిగిపోయింది. సోమవారం సాయంత్రం పెనుమంట్ర పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాడేపల్లిగూడెం (టీఓసీ): హత్య కేసులో తాడేపల్లిగూడెం 11వ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధించారు. రెండేళ్ల క్రితం ఈ హత్య జరిగింది. పట్టెంపాలెంకు చెందిన శ్రీను, కుమారిలు సహజీవనం చేసేవారు. కుమారిపై అనుమానంతో తరుచుగా శ్రీను గొడవపడేవాడు. ఒక రోజు రాత్రి కుమారిని మంచం చెక్కతో బలంగా కొట్టగా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. గ్రామ వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.