
సేవకులకు వంచన
కొనసాగిస్తామని మాటిచ్చి..
హామీని అమలుచేయాలి
వలంటీర్లను వంచించారు
హామీలను తుంగలో తొక్కి..
ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాకా బోడి మల్లన్న చందాన ఉంది కూటమి తీరు. వలంటీర్లను కొనసాగిస్తాం, పారితోషికం నెలకు రూ.10 వేలకు పెంచుతామని చెప్పిన కూటమి పెద్దలు ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడంతో వలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ మొదలై శుక్రవారానికి ఆరేళ్లు కాగా కూటమి ప్రభుత్వ నిర్వాకంతో 16 నెలలుగా వీరి సేవలు నిలిచిపోయాయి.
సాక్షి, భీమవరం: కులమతాలు, రాజకీయాలకు అతీ తంగా అర్హుల చెంతకే సంక్షేమ పథకాలు చేరవేసే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో 50 ఇళ్లకు, పట్టణాల్లో 75 నుంచి 100 ఇళ్లకు ఒకరు చొప్పున జిల్లాలో 8,616 మంది వలంటీర్లను నియమించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా 2019 ఆగస్టు 15న వలంటీర్ వ్యవస్థను ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని అందేలా చూడటం, అవసరమైన సర్టిఫికెట్లు మంజూరు చేయించడం, విద్యు త్ బిల్లుల చెల్లింపులు తదితర సేవలందించేవారు. కరోనాకు జడిసి సొంతవాళ్లు, చుట్టుపక్కల వారు దగ్గరకు రాలేని పరిస్థితుల్లో బాధితులకు బాసటగా నిలిచారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి ప్రభు త్వం ద్వారా ఆహారం, నిత్యావసర సరుకులు, మందులు అందజేసేవారు. కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వీరు ఎనలేని సేవలందించారు. గోదావరి వరదల సందర్భంగా నీట మునిగిన లంక గ్రామాల ప్రజలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సరుకులు, మందులు ఇంటింటికి వెళ్లి అందజేస్తూ వలంటీర్లు అందించిన సేవలు చిరస్మరణీయం. అనారోగ్యంతో ఇతర రాష్ట్రాల్లో చికిత్స పొందుతున్న లబ్ధిదారుల చెంతకు సైతం వెళ్లి ప్రభుత్వ సాయాన్ని అందజేస్తూ ఆదర్శంగా నిలిచిన వారెందరో ఉన్నారు. కేవలం రూ.5 వేల గౌరవ వేతనంతో పారదర్శకంగా సేవలందించిన వలంటీర్ వ్యవస్థ దేశవ్యాప్తంగా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. వలంటీర్ వ్యవస్థపై మొదల్లో ‘గోనె సంచులు మోసే అవేం ఉద్యోగాలు’ అంటూ చిన్నచూ పు చూసిన చంద్రబాబు, మహిళల మిస్సింగ్‌కు వ లంటీర్లే కారణమంటూ విషం కక్కిన పవన్ కళ్యాణ్‌లు ఎన్నికలు వచ్చేసరికి మాట మార్చారు.
ఎన్నికల సంఘానికి కూటమి అనుకూల వర్గాల ఫిర్యాదుల నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ నుంచి వలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు హామీలు గుప్పించారు. మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చారు. కూటమి పాలన చేపట్టి ఏడాది పైబడినా హామీ అమలు దిశగా చర్యలు చేపట్టకపోగా వలంటీర్లను నిబంధనలు మేరకు తీసుకోలేదంటూ ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేయడం గమనార్హం. ప్రభుత్వ తీరుతో తమ భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. కూటమి ఎన్నికల వాగ్ధానం అమలుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కూటమి వెన్నుపోటు
ప్రభుత్వానికీ ప్రజలకు వారధిలా పనిచేసిన వలంటీర్లు
పారదర్శకంగా పథకాల అమలుకు దోహదం
గౌరవ వేతనం రూ.10 వేలు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ
అధికారంలోకి వచ్చాక ఆ ఊసెత్తని కూటమి పెద్దలు
నేటితో వలంటీర్ వ్యవస్థకు ఆరేళ్లు
జిల్లాలో 8,616 మంది వలంటీర్ల సేవలు
‘వలంటీర్లలో చాలా సమర్థత ఉంది. మేం అధికారంలోకి వస్తే వారిని ఉద్యోగాల నుంచి తీయబోం. వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం. వారికి ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచే బాధ్యత నేను తీసుకుంటాను’.
– ఎన్నికల్లో చంద్రబాబు హామీ
‘వలంటీర్లు నా అక్కాచెల్లెళ్లు. ఏ రోజూ కూడా నాకు వారి పొట్టకొట్టాలన్న ఉద్దేశం లేదు. మీకు రూ.5 వేలు వస్తే.. మరో రూ.5 వేలు అదనంగా ఇచ్చే మనసున్న వాణ్ణి’.
– ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ హామీ
ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాం. కోవిడ్‌కు జడిసి ఎవరూ బయటకురాని సమయంలో ఇంటింటికీ వెళ్లి మందులు అందజేశాం. వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, పారితోషికం రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలుపుకోవాలి.
– హెచ్‌వీకే చక్రవర్తి, వెలగలేరు, పెనుమంట్ర మండలం
వలంటీర్ల పొట్టకొట్టబోమని, తాము అధికారంలోకి వస్తే పారితోషికం రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో పదేపదే చెప్పిన కూటమి నాయకులు తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల వాగ్దానం అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
– దిడ్ల సత్యానందం, తణుకు
జగనన్న వలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి స్థానికంగా ఉపాధి కల్పించారు. అయితే కూటమి నాయ కులు అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారు. మా ఉద్యోగాలు ఊడగొట్టి నోటికాడ కూడు లాగేసుకున్నారు.
– ఎన్.లీలా ప్రియ, కుముదవల్లి

సేవకులకు వంచన

సేవకులకు వంచన

సేవకులకు వంచన

సేవకులకు వంచన

సేవకులకు వంచన