
ముంపు చేల పరిశీలన
అత్తిలి: మండలంలోని తిరుపతిపురం, వరిఘేడు ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను గురువారం కలెక్టర్ సీహెచ్ నాగరాణి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బుధవారం ఒక్కరోజు 1799.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. దీంతో సుమారు 400 నుంచి 500 ఎకరాల వరకు పొలాలు ముంపు బారిన పడ్డాయన్నారు. ప్రస్తుతం వ ర్షం ఆగినందున నీరు తొలగితే ఇబ్బంది ఉండదని, వ్యవసాయాధికారులు పంట నష్టం వివరాలు నమోదు చేస్తారన్నారు. తహసీల్దార్ దశిక వంశీ, సిబ్బంది ఉన్నారు.
భీమవరం: జిల్లాలో గురువారం ఉదయం వర కు 20 మండలాల్లో సగటున 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తణుకులో 236.6 మి.మీ., అత్యల్పంగా మొగల్తూరులో 8.6 మి.మీ. వర్షం పడింది. మండలాల వారీ గా వర్షపాతం ఇలా.. తాడేపల్లిగూడెంలో 162.2 మి.మీ, పెంటపాడులో 189, అత్తిలిలో 85.4, గణపవరంలో 144.4, ఆకివీడులో 77.2, ఉండిలో 54.4, పాలకోడేరులో 76.2, పెనుమంట్రలో 75.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇరగవరంలో 196.6, పెనుగొండలో 193.8, ఆచంటలో 40.2, పోడూరులో 82.6, వీరవాసరంలో 22.2, భీమవరంలో 27.6, కాళ్లలో 42.6, నరసాపురంలో 32.4, పాలకొల్లులో 35.2, యలమంచిలిలో 17.4 మి.మీ వర్షపాతం నమోదైంది.
భీమవరం (ప్రకాశంచౌక్): భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ, నీటి నిర్వహణ తదితర అంశాలపై అమరావతి నుంచి గురువారం కలెక్టర్లు, సాగునీటి సంఘాల, ప్రాజెక్ట్ సంఘాల ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సీహెచ్ నాగరాణి, జేసీ టి.రాహుల్‌కుమార్ రెడ్డి, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, అధికారులు హాజరయ్యారు. నీటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మండవల్లి: మండవల్లిలోని స్టేషన్ రోడ్డులో తా గునీటి సమస్య పరిష్కరించాలంటూ గురువా రం జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. 20 రోజుల నుంచి కుళాయిల నుంచి తాగునీరు రావడం లేదని, తమను పట్టించుకునే నాథుడే లేడంటూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సర్పంచ్, అధికారులు వచ్చి సమాధానం చెప్పాలంటూ భీష్మించారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని, ఎన్ని రోజులు ఓపిక పట్టాలని మహిళలు పోలీసుల వద్ద వాపోయారు.
బుట్టాయగూడెం: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం సమీపంలోని రోడ్డు గురువారం ఉదయం కొట్టుకుపోయింది. దీనితో పై గ్రామాలకు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్‌లో గురువారం వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా స్కూలింగ్–బిల్డింగు బ్లాక్స్ అనే అంశంపై విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి వర్క్‌షాప్ నిర్వహించారు. దేశం మొదటి స్థానంలో నిలిచే లక్ష్యంగా అన్ని రంగాల్లో నిరంతర లక్ష్యాలు, నిర్దేశం, సాధన చాలా అవసరమన్నారు. మానవ వనరుల అభివృద్ధి యువత, వయోజనులు, మహిళలపై నిర్మించబడి ఉందన్నారు.

ముంపు చేల పరిశీలన

ముంపు చేల పరిశీలన