
స్వాతంత్య్ర దినోత్సవాలకు సర్వం సిద్ధం
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరంలోని కలెక్టరేట్ వద్ద పరేడ్ గ్రౌండ్స్ స్వాతంత్య్ర దినోత్సవాలకు సిద్ధమైంది. ఐదు వేదికలు, గ్యాలరీ, స్టాల్స్, శకటాలను గురువారం జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. వేడుకల నిర్వహణ సందర్భంగా ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రొటోకాల్‌ను అనుసరించి సిట్టింగ్, స్టేజీ ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. విద్యుత్‌లో సరఫరాలో ఆటంకం లేకుండా చూడాలన్నారు. వైద్య శిబిరం, అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఉపరితల ద్రోణి కారణంగా భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలిస్తున్న జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి
త్రివర్ణ కాంతులతో కలెక్టరేట్ భవనం

స్వాతంత్య్ర దినోత్సవాలకు సర్వం సిద్ధం