
గవర్నర్‌తో మీట్ ఎట్‌కు నాగేంద్రసింగ్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ కార్యాలయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో జరిగే మీట్ ఎట్ కార్యక్రమానికి ఏలూరు జిల్లా నుంచి నాగేంద్ర సింగ్ ఎంపికయ్యారు. నాగేంద్రసింగ్ ఏలూరు శ్రీరామ్‌నగర్‌లోని ఎంపీయూపీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. అంతర్జాతీయస్థాయి దివ్యాంగుల క్రికెట్ పోటీలకు అంపైర్‌గా కూడా సేవలందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం గవర్నర్ ఇచ్చే తేనీటి విందులో పాల్గొని గవర్నర్ నుంచి సన్మానం అందుకోనున్నారు.
తాడేపల్లిగూడెం: వెంకట్రామన్నగూడెంలోని ఉద్యా న వర్సిటీలో డిప్లమో హార్టీకల్చర్, డిప్లమో ల్యాండ్ స్కేపింగ్, నర్సరీ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది విడత స్పాట్ కౌన్సెలింగ్‌ను ఈనెల 20న నిర్వహించనున్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్ బి.శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు. నాలుగు ప్రభుత్వ, మూడు గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి గతంలో దరఖాస్తు చేసుకున్నా, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉద్యాన వర్సిటీ ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలతో స్వయంగా హాజరుకావాలని సూచించారు.