ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి
న్యూశాయంపేట: రెడ్‌క్రాస్ సొసైటీ సేవాదృక్పథంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా తొలి మేనేజింగ్ కమిటీ సమావేశాన్ని గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, మానవత్వానికి మరో రూపం రెడ్‌క్రాస్ సొసైటీ అని పేర్కొన్నారు. జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ విభాగాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బేతి అశోక్‌బాబు మాట్లాడుతూ వరంగల్ నూతన కలెక్టరేట్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యాలయానికి స్థలం కేటాయించాలని, ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు నర్సంపేట, వర్ధన్నపేట ప్రాంతాల్లో జనరిక్ మెడికల్ స్టోర్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసి, అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌ను కోరగా అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈవీ శ్రీనివాస్‌రావు ను ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా సలహాదారుగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సమావేశంలో వైస్ చైర్మన్ శానబోయిన రాజ్‌కుమార్, రాష్ట్ర పాలకమండలి సభ్యులు నాడెం శాంతికుమార్, కోశాధికారి బొల్లం శివ, జిల్లా పాలకమండలి సభ్యులు మండల పరశురాములు, తోట సంపత్ కుమార్, చొప్పరి సోమయ్య, కుసుమ సత్యనారాయణ, మామిడాల రమేశ్‌బాబు, మోతె తిరుపతిరెడ్డి, డాక్టర్ గజవెల్లి రాజ్‌కుమార్, ముల్క ప్రసాద్, వడ్డె రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌నినోపై అప్రమతంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్లు ఎల్.కిశోర్‌కుమార్, వైవీ గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈహెచ్‌ఎస్ అమలుకు
6 ఆస్పత్రుల అంగీకారం
ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్) అమలుకు నగరంలోని 6 ఆస్పత్రులు అంగీకారం తెలిపాయి. ఈమేరకు గురువారం కలెక్టరేట్‌లో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్‌పై ఐఎంఏ ప్రతినిధులు, ఆస్పత్రుల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. సంరక్ష సూపర్ స్పెషాలిటీ, గంగా, క్యూర్‌వెల్, సత్య, బాలాజీ, ఎన్‌ఎస్‌ఆర్ అపోలో ఆస్పత్రులు అంగీకరించాయి. డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఐఎంఏ ప్రతినిధులు సంపత్, రమేష్, నరేశ్‌కుమార్ ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్‌నిఖిల్ స్వరూప్, ఎస్‌ఓ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి
రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లతో భూ రీసర్వే, భూదాన్ భూములు, భూ భారతి, నక్షా, భూ సేకరణ, ఇన్నర్ రింగ్‌రోడ్డు, జాతీయ రహదారి(163జీ), మామునూరు విమానాశ్రయం, ఎస్‌ఐఆర్, ఎమ్మెల్సీ ఎన్నికలు తదితర అంశాలపై సమీక్షించారు. ఆయా శాఖలకు సంబంధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా మేనేజింగ్ కమిటీ
సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద


