న్యూశాయంపేట: కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో గురువారం పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొని సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పండుగ సాయన్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీసీడీఓ పుష్పలత, ముదిరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బాధ్యులు దేవేందర్, ముదిరాజ్ మహాసభ బాధ్యులు పి.అశోక్, నాయకులు రాజు, రమేశ్, రాజ్‌కుమార్, మొగిలి, సారంగపాణి, రాజేశ్, రజినీ కాంత్, విక్రం, శ్రవణ్, అమర్ పాల్గొన్నారు.
టెన్త్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్
కాళోజీ సెంటర్: టెన్త్, ఓపెన్ టెన్త్, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఆదేశాల ప్రకారం రెగ్యులర్, ఒకసారి ఫెయిలైన విద్యార్థులు నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈఓ ఎన్.ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అపరాధ రుసుము లేకుండా ఈనెల 30 నుంచి నవంబర్ 16 వరకు విద్యార్థులు ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో ట్రెజరీ ద్వారా నవంబర్ 17లోగా ఫీజు చెల్లించాలని, విద్యార్థుల వివరాలను డీఈఓకు నవంబర్ 21లోగా ఆన్‌్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు.
పరీక్ష ఫీజు వివరాలు..
ఎస్సెస్సీ అకడమిక్ కోర్సుల విద్యార్థులకు సాధారణ పరీక్ష ఫీజు రూ.125గా నిర్ణయించారు. ఒకటి నుంచి మూడు సబ్జెక్టులకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలి. ఒకేషనల్ అభ్యర్థులు సాధారణ ఎస్సెస్సీ పరీక్ష ఫీజు రూ.125తో పాటు అదనంగా రూ.60 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని డీఈఓ పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు.
భూసార పరిరక్షణతో
అధిక దిగుబడి
ఖిలా వరంగల్: భూసారం పరిరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామంలోని రైతు వేదికలో తెలంగాణ వ్యవసాయశాఖ గురువారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ సురేంద్రమోహన్, వ్యవసాయశాఖ కమిషనర్ గోపితో కలిసి మంత్రి తుమ్మల రైతులకు పలు సూచనలు చేశారు. ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంక, డీఏఓ విజయభాస్కర్ వీక్షించారు. ఆత్మ పీడీ విజయ నిర్మల, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా మార్కెటింగ్ అధికారి, జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ అధికారి, కేవీకే శాస్త్రవేత్త అరుణ జ్యోతి, మండల వ్యవసాయాధికారులు రవీందర్, శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కేడల జనార్దన్, భూమాత, ఏఈఓ మనస్విని, రైతులు పాల్గొన్నారు


