వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Oct 22 2026 1:21 AM | Updated on Oct 22 2026 1:21 AM

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 22 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
నేటి నుంచి

నవంబర్‌లో ఓపీ సేవలు!

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వాయిదాపడిన ఓపీ సేవలను తిరిగి నవంబర్‌ మొదటి వారంలో ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సాక్షి, వరంగల్‌: పత్తి రైతులకు ఈసారి పరిస్థితులు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడిపై ఆందోళన నెలకొనగా.. మరోవైపు ప్రైవేట్‌ వ్యాపారులు అధిక ధరలు చెల్లిస్తుండడం కొంత ఊరటనిస్తోంది. భారత పత్తి సంస్థ (సీసీఐ) కొనుగోళ్లు గురువారం నుంచి ప్రారంభం కానుండడంతో మార్కెట్‌లో పోటీ పెరిగే అవకాశం ఏర్పడింది.

పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 16 మార్కెట్ల పరిధిలో 19 కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర మీడియం స్టేపుల్‌ పత్తికి రూ.8,267, లాంగ్‌ స్టేపుల్‌కు రూ.8,667 మద్దతు ధరకు అనుగుణంగా సీసీఐ కొనుగోళ్లు చేపట్టనుంది. వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్‌లో ప్రైవేట్‌ వ్యాపారులు మాత్రం ప్రస్తుతం క్వింటాకు రూ.9,300 నుంచి రూ.9,600 వరకు చెల్లిస్తున్నారు. దీంతో సీసీఐకి విక్రయించాలా? ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్మాలా? అనే విషయంలో రైతులు లెక్కలు వేసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో పత్తి దిగుబడి తగ్గితే మాత్రం ఇంకా ధరలు పెరగొచ్చని మార్కెట్‌ వర్గాలంటున్నాయి.

5,54,599 ఎకరాల్లో పత్తి సాగు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పత్తి ప్రధాన వాణిజ్య పంటగా కొనసాగుతోంది. జనగామ, వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, హనుమకొండ, ములుగు జిల్లాల్లో వేలాది మంది రైతులు పత్తి సాగుపైనే ఆధారపడుతున్నారు. జనగామ జిల్లాలో 1,38,325 ఎకరాలు, వరంగల్‌ జిల్లాలో 1,12,044 ఎకరాలు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 1,09,442 ఎకరాలు, మహబూబాబాద్‌ జిల్లాలో 91,916 ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 75,740 ఎకరాలు, ములుగు జిల్లాలో 27,132 ఎకరాల్లో పత్తి సాగవుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో 5,54,599 ఎకరాల్లో పత్తి సాగు కాగా, సుమారు 3,22,136 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం, ప్రైవేట్‌ వ్యాపారుల పోటీతో సీసీఐకు తక్కువ సంఖ్యలో పత్తి రావొచ్చని అభిప్రాయపడుతున్నారు.

కిసాన్‌ కపాస్‌ యాప్‌తోనే కొనుగోళ్లు

సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకోవాలంటే కపాస్‌ కిసాన్‌ యాప్‌లో పేరు నమోదు చేసుకొని స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంక్‌ ఖాతా వివరాలతో ఈ యాప్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. రైతు భూమి, సాగు విస్తీర్ణం ఆధారంగా ఫార్మర్‌ రిజిస్ట్రీ ఐడీతో అనుసంధానించి స్లాట్లు కేటాయిస్తారు. ఈ సారి స్లాట్‌ బుకింగ్‌ గడువును ఏడు రోజుల నుంచి 14 రోజులకు పెంచారు. రైతు రోజుకు 100 క్వింటాళ్ల వరకు విక్రయించొచ్చు. ప్రతి లావాదేవీకి ఆధార్‌, ఓటీపీ ధ్రువీకరణ తప్పనిసరి. పత్తి నాణ్యత, తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాతే కొనుగోలు ధరను నిర్ణయిస్తారు. ఈ క్రమంలో రైతులు పత్తిని బాగా ఆరబెట్టి, కేటాయించిన తేదీనే కేంద్రానికి తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్‌లో సీసీఐ ఆధ్వర్యంలో 19 కేంద్రాలు

5,54,599 ఎకరాల్లో పంట సాగు

3.22 లక్షల మెట్రిక్‌ టన్నులొస్తుందని అంచనా

దిగుబడిపై ఎల్‌నినో ఎఫెక్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement