పోలీస్‌ అమరుల త్యాగాలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అమరుల త్యాగాలు చిరస్మరణీయం

Oct 22 2026 1:21 AM | Updated on Oct 22 2026 1:21 AM

హసన్‌పర్తి / న్యూశాయంపేట: పోలీస్‌ అమరుల త్యాగాలు చిరస్మరణనీయమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అన్నారు. పోలీసుల అమరుల సంస్మరణ వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హనుమకొండ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని అమరుల స్తూపం వద్ద పోలీస్‌ కమిషనర్‌ శ్వేత, వరంగల్‌, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్‌ బాజ్‌పాయ్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, అమరవీరుల కుటుంబసభ్యులు, పోలీసు అధికారులు నివాళులర్పించారు. అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం కృషిచేస్తున్నారని తెలిపారు. అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటివరకు విధి నిర్వహణలో 25 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బంది అమరులయ్యారని చెప్పారు. అమరుల కుటుంబాల సంక్షేమానికి పోలీసు శాఖ కట్టుబడి ఉందని, ప్రభుత్వంతో చర్చించి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం అమరవీరుల కుటుంబాలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా హనుమకొండలోని అశోకా జంక్షన్‌ నుంచి పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, అడిషనల్‌ డీసీపీలు రాయల ప్రభాకర్‌రావు, బాలస్వామి, సురేశ్‌, శ్రీనివాస్‌, ఏసీపీలు, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement