రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి కొత్తూరు సర్పంచ్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి కొత్తూరు సర్పంచ్‌

Oct 22 2026 1:21 AM | Updated on Oct 22 2026 1:21 AM

రాయపర్తి: హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీఐటీ)లో నిర్వహించనున్న మూడు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి కొత్తూరు సర్పంచ్‌ కందికట్ల స్వప్నసంతోష్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు సర్పంచ్‌ బుధవారం మాట్లాడుతూ ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజులపాటు సర్పంచ్‌లకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎంపికకావడం సంతోషంగా ఉందని అన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌కు పాలకవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement