దుగ్గొండి: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. దీంతో బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి చాలా గ్రామాల్లో అవస్థలు పడ్డారు. రేకంపల్లి, మందపల్లి, గిర్నిబావి, బిక్కాజిపల్లి గ్రామాల్లో బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి తాత్కాలికంగా తొట్టెలు ఏర్పాటు చేశారు. గుంత తవ్వి పాలిథిన్ కవర్‌లు పరిచారు. దానిలో ట్యాంకర్ల సాయంతో నీరు పట్టారు. అనంతరం బతుకమ్మలను అందులో నిమజ్జనం చేశారు.
నేటి ప్రజావాణి రద్దు
న్యూశాయంపేట: పరిపాలనా కారణాలతో కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే సోమవారం యథావిధిగా గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.


