హేమాచలక్షేత్రంలో భక్తజనం | - | Sakshi
Sakshi News home page

హేమాచలక్షేత్రంలో భక్తజనం

Oct 19 2026 7:24 AM | Updated on Oct 19 2026 7:24 AM

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం భక్తజనంతో ఆదివారం కిటకిట లాడింది. వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్న భక్తులు మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ పూజారులు గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement