హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శ్రీరుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 8వ రోజు ఆదివారం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్, భరత్‌శర్మ సుప్రభాతసేవ, అభిషేకాలు, అర్చనలు జరిపారు. దుర్గాష్టమిని పురస్కరించుకుని శ్రీదుర్గామాతగా అలంకరించారు. దాత కోన శ్రీకర్ దంపతులు అందించిన కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి నీరాజన మంత్రపుష్పం చేశారు. భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ముదిరాజ్ సంఘం నాయకుడు పులి రజినీకాంత్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడు చొల్లేటి కృష్ణమాచారి, గంగపుత్ర సంఘం నాయకులు గరిగ అశోక్, ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు పల్లం రమేశ్, మాడిశెట్టి వరుణ్ తదితరులు పాల్గొని సేవలందించారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.


