వేలేరు: మండలంలో కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయి బుధవారం విస్తృతంగా పర్యటించారు. వెద్య, విద్య, భూ రీసర్వే ప్రక్రియలను పరిశీలించారు. మొదట మల్లికుదుర్లలో కొనసాగుతున్న భూముల రీసర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అల్పాహారం, భోజనం నాణ్యత, ఉపాధ్యాయుల హాజరు, తరగతి గదులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అందుతున్న వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. శ్రీఆస్పత్రిలో వైద్య సిబ్బంది సరిగ్గా డ్యూటీకి రావడం లేదని, సాయంత్రం వరకు డ్యూటీ చేయకుండా మధ్యాహ్నం వరకే వెళ్లిపోతున్నారుశ్రీ అని సర్పంచ్ బిల్లా యాదగిరి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వెంకటేశ్, డీఈఓ ఎల్వీ.గిరిరాజ్‌గౌడ్, తహసీల్దార్ కోమి, ఎంపీడీఓ కిషన్, జీసీడీఓ సునీత, ఎంఈఓ చంద్రమౌళి, వైద్యాధికారి డాక్టర్ మేఘన, సర్పంచ్‌లు యాదగిరి, శ్రీనివాస్, కేజీబీవీ ఎస్‌ఓ స్రవంతి పాల్గొన్నారు.


