న్యూస్‌రీల్
లాభాలు ఏంటంటే..
నేటి నుంచి పీఎం సూర్యఘర్‌పై అవగాహన సదస్సులు
● సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంపే లక్ష్యంగా టీజీఎన్పీడీసీఎల్
● ఒకే వేదికపై డిస్కం, రెడ్‌కో, బ్యాంకర్లు
ఎన్పీడీసీఎల్ పరిధిలో 203.10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి
పీఎం సూర్య ఘర్–ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా తమ ఇళ్ల పైకప్పులపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు.
ఈపథకం కింద గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఒక కిలోవాట్‌కు రూ.30,000, 2 కిలోవాట్లకు రూ.60,000, 3 కిలోవాట్లకు ఆపైన కిలోవాట్ల సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.78,000 కేంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తోంది.
రూఫ్‌టాప్ సోలార్ ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకునే అవకాశంతో పాటు మిగులు విద్యుత్‌ను ఉత్పత్తిని గ్రిడ్‌కు సరఫరా చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు
ఈపథకం ద్వారా 3 కిలోవాట్లకు దాదాపు నెలకు 450 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకొనే అవకాశం ఉంది.
టిజీఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రస్తుతం 34,023 విద్యుత్ సర్వీస్ (వినియోగదారుల రూఫ్‌టాప్ సోలార్)ల ద్వారా 203.1 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 20,000 దరఖాస్తులు పురోగతిలో ఉన్నాయి.


