డీసీసీబీకి పర్సన్‌ ఇన్‌చార్జ్‌ కమిటీ నియామకం | - | Sakshi
Sakshi News home page

డీసీసీబీకి పర్సన్‌ ఇన్‌చార్జ్‌ కమిటీ నియామకం

Oct 1 2026 9:33 AM | Updated on Oct 1 2026 9:33 AM

హన్మకొండ: వరంగల్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన పర్సన్‌ ఇన్‌చార్జ్‌ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ చైర్‌పర్సన్‌గా, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ), జిల్లా సహకార అధికారి సభ్యులుగా కమిటీని నియమిస్తూ అగ్రికల్చర్‌ అండ్‌ కోఆపరేషన్‌ డిపార్ట్‌మెంట్‌ జీఓతో ఏపీసీ అండ్‌ సెక్రటరీ గవర్నమెంట్‌ కె.సురేంద్రమోహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనియామకం ఆరు నెలలు లేదా ఎన్నికలు జరిగే వరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏది ముందైతే అది వర్తిస్తుందని పేర్కొన్నారు. కాగా, పాలకమండలి, పర్సన్‌ ఇన్‌చార్జ్‌ కమిటీ లేకపోవడంతో ఆడిట్‌ చేసిన నివేదికలు, బ్యాలెన్స్‌ షీట్లను ఆర్‌బీఐ, నాబార్డుకు సమర్పించడం.. ఆమోదం ప్రక్రియ నిలిచిపోయింది. ప్రధానంగా రూ.10 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాల ఆమోదం, విడుదల ఆలస్యమవుతోంది. కోర్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్‌ పరిజ్ఞానం మార్పిడి, కేంద్ర ప్రభుత్వ పథకాల డీపీఆర్‌ ఆమోదంలో జాప్యం జరుగుతూ వస్తోంది. ప్రాథమిక సహకార సంఘాల పునర్వ్యవస్తీకరణ, ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో ఆరు నెలల కాలానికి పర్సన్‌ ఇన్‌చార్జ్‌ కమిటీని ప్రభుత్వం నియమించింది.

చైర్‌పర్సన్‌గా కలెక్టర్‌

చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement