ఐనవోలు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–17 బాలికల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జెడ్పీహెచ్‌ఎస్ సింగారం పదోతరగతి విద్యార్థిని పత్తి అమృత ఉత్తమ ప్రతిభ కనబర్చింది. 7 కిలోలకు పైబడిన విభాగంలో క్లీన్, స్నాచ్ అండ్ జర్క్ పోటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈసందర్భంగా సోమవారం పాఠశాలలో పత్తి అమృతతో పాటు ఆమె విజయానికి కృషి చేసిన క్రీడల ఇన్‌చార్జ్ టీచర్ ప్రశాంత్‌ను హెచ్‌ఎం పోరిక అన్నపూర్ణ అభినందించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం విజయభాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు అలిగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, మంజులాల్ పాల్గొన్నారు.


