విదేశాలకు ములుకనూరు విత్తనాలు | - | Sakshi
Sakshi News home page

విదేశాలకు ములుకనూరు విత్తనాలు

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

విదేశాలకు ములుకనూరు విత్తనాలు

భీమదేవరపల్లి: అమెరికా, అరబ్‌ దేశాలతో పాటు ఇతర దేశాలకు ములుకనూరు సహకార సంఘం విత్తనాలు ఎగుమతులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. సోమవారం ములుకనూరు పారాబాయిల్డ్‌ రైస్‌మిల్‌ ఆవరణలో సహకార సంఘం 70వ వార్షిక మహసభ నిర్వహించారు. ఈసందర్భంగా వార్షిక నివేదికను బ్యాంకు సిబ్బంది గొల్లపల్లి రాజమౌళి చదివి వినిపించారు.

లాభం రూ.7.22 కోట్లు..

సంఘం అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈసంవత్సరం సహకార సంఘం రూ.426 కోట్ల వ్యాపారం చేయగా.. రూ.7.22 కోట్లు లాభం వచ్చినట్లు తెలిపారు. ఇందులో నుంచి సభ్యులకు రూ.3.50 కోట్లు బోనస్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. గతంలో సభ్యులకు పంట అప్పు ఎకరాకు రూ.46 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇది ఖరీఫ్‌ సీజన్‌ నుంచి అమలవుతుందన్నారు. అలాగే సంఘ సభ్యులు మరణిస్తే రూ.15 వేలతో పాటు క్వింటా బియ్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయని, ముందస్తుగా 28 వేల బస్తాల ఎరువులు నిల్వ ఉంచడంతో రూ.1.77 కోట్ల లాభం వచ్చినట్లు తెలిపారు. రూ.250 కోట్ల వరకు సభ్యులకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ముల్కనూరు సీడ్‌ వడ్లు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు జరుపుతున్నామన్నారు. సభ్యులందరి సమష్టి కృషితో సంఘం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు గజ్జి వీరయ్య, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్‌, వసంత, కుమారస్వామి, రాములు, కనుకమ్మ, మహేందర్‌, రవీందర్‌, శ్రీనివాస్‌, బుచ్చయ్య, మూగయ్య, భాషు, భాస్కర్‌రెడ్డి, వీరారెడ్డి, జీఎం రాంరెడ్డి, ఏజీఎం సతీశ్‌, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు పంట అప్పు ఎకరాకు

రూ.50 వేల పెంపు

సభ్యులకు రూ.3.50 కోట్లు బోనస్‌

ములుకనూరు సహకార సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి

ఘనంగా 70వ వార్షిక మహాసభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement