దావత్‌కు పిలిచి.. ప్రాణాలు తీసి | - | Sakshi
Sakshi News home page

దావత్‌కు పిలిచి.. ప్రాణాలు తీసి

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

హుజూరాబాద్‌రూరల్‌: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద సోమవారం దారుణహత్య జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పలపల్లికి చెందిన వడిగే రాకేశ్‌(32)కు సమీప బంధువు అంబరకొండ ప్రశాంత్‌తో కొంతకాలంగా విభేదాలున్నాయి. రాకేశ్‌ను మట్టుబెట్టాలని రెండు నెలలుగా ప్రణాళిక రచించిన ప్రశాంత్‌.. ఈనెల 27న హుజూరాబాద్‌కు రప్పించాడు. ఇద్దరూ కలిసి పట్టణ శివారులోని ఓ దాబాలో మద్యం సేవించారు. ఆ తర్వాత కేసీ క్యాంపు మీదుగా పెద్దపాపయ్యపల్లి ఎస్సారెస్పీ కెనాల్‌ వద్దకు చేరుకుని.. నిర్మానుష్య ప్రాంతంలో రాకేశ్‌పై కత్తితో దాడి చేసి హతమార్చాడు. సోమవారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రశాంత్‌ భార్యతో రాకేశ్‌కు వివాహేతర సంబంధం ఉండడమే హత్యకు కారణమని ప్రచారంలో ఉంది. కాగా, నిందితుడు ప్రశాంత్‌ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పథకం ప్రకారమే హత్య

పెద్దపాపయ్యపల్లి శివారులో ఘటన

వివాహేతర సంబంధమే కారణం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement