ఐలోని ఆలయ హుండీ ఆదాయం రూ.37.07 లక్షలు | - | Sakshi
Sakshi News home page

ఐలోని ఆలయ హుండీ ఆదాయం రూ.37.07 లక్షలు

Sep 26 2026 1:38 AM | Updated on Sep 26 2026 1:38 AM

ఐలోని ఆలయ హుండీ ఆదాయం రూ.37.07 లక్షలు

ఐనవోలు: ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కించారు. జూన్‌ 19 నుంచి సెప్టెంబర్‌ 24 వరకు 97 రోజులకుగాను హుండీ ద్వారా రూ.7,37,225, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.29,69,876.. మొత్తం రూ.37,07,101 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్‌ తెలిపారు. హుండీల్లో లభ్యమైన మిశ్రమ వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలోనే వేసి సీల్‌ చేసినట్లు పేర్కొ్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్‌ డివిజినల్‌ పరిశీలకురాలు నందనం కవిత పర్యవేక్షణలో నిర్వహించిన హుండీ లెక్కింపులో.. ఆలయ ఉపప్రధాన అర్చకులు మధుశర్మ, నరేశ్‌శర్మ, సాయి వరుణ్‌, కానిస్టేబుల్‌ కనకస్వామి, ఒగ్గు పూజారులు మజ్జిగ అశోక్‌, కరీంనగర్‌కు చెందిన శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్‌ సభ్యులు, అర్చక సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement