● జిల్లా నోడల్ అధికారి పార్థసారథి
నర్సంపేట రూరల్: ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు బోధన చేయాలని జిల్లా నోడల్ అధికారి పార్థసారథి అన్నారు. లక్నెపల్లి స్కూల్ కాంప్లెక్స్, మాదన్నపేట స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులతో కనీస అభ్యసన సామర్థ్యాలు, చతుర్విద ప్రక్రియలు సాధించే దశలో ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్‌ను అమలుచేసి విద్యార్థుల విద్యాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఎంఈఓ భిక్షపతి మాట్లాడుతూ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ఎకో క్లబ్ నిర్వహించాలన్నారు. కాంప్లెక్స్ హెచ్‌ఎం రామచంద్రం, అసిస్టెంట్ సెక్రటరీ ఎస్‌కే సర్దార్, ఆర్పీలు లక్‌పతి, రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


