శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

Sep 26 2026 1:38 AM | Updated on Sep 26 2026 1:38 AM

ఖానాపురం: క్రీడాకారులు శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ పుల్లూరి శ్రీనివాస్‌ సూచించారు. అశోక్‌నగర్‌లోని సైనిక్‌ స్కూల్‌లో బాలుర కబడ్డీ శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం శ్రీనివాస్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ 1 నుంచి 4 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు జరగనున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించేందుకు క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ అబ్దుల్లాఖాన్‌, కళాశాలల వైస్‌ ప్రిన్సిపాళ్లు అనూష, సాయిల్‌, కోశాధికారి ముఖర్జీ, మల్లికార్జున్‌, కబడ్డీ కోచ్‌ యాట రవికుమార్‌, సైనిక్‌ స్కూల్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

లడ్డూ వేలం రూ.1,70,777

వర్ధన్నపేట: పట్టణంలోని ఆటోనగర్‌ గణపతి మండపంలో శుక్రవారం నిర్వాహకులు లడ్డూ వేలం నిర్వహించారు. అనుమాస ప్రసన్న రూ.1,77,777కు లడ్డూ దక్కించుకుంది. అనిమిరెడ్డి రాంచద్రారెడ్డి రూ.1,70 లక్షల వరకు పాడి తప్పుకున్నారు. దీంతో భక్తురాలు ప్రసన్న లడ్డూను దక్కించుకుంది.

ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి

నర్సంపేట: విద్యార్థినులు సానుకూల దృక్ఫథంతో ఉండి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీలత సూచించారు. నర్సంపేటలోని టీజీఎంఆర్‌ఎస్‌ జేసీ గర్ల్స్‌–1లో శుక్రవారం మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణ, మానసిక ప్రశాంతతపై అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, తమ భావాలను బహిరంగంగా పంచుకోవాలని, అవసరమైనప్పుడు ఇతరుల సాయం తీసుకోవాలని సూచించారు.

రోళ్లకల్‌ ఊర చెరువు మత్తడికి బుంగ

పర్వతగిరి: మండలంలోని రోళ్లకల్‌ ఊరచెరువు మత్తడికి శుక్రవారం బుంగ పడింది. అప్రమత్తమైన గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో తహసీల్దార్‌ వెంకటస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని ఇసుక బస్తాలు వేయించి బుంగను పూడ్చివేయించారు. అదేవిధంగా బూరుగుమల్ల గ్రామ చెరువు కట్ట కోతకు గురైంది. రెవెన్యూ అధికారులు ఇసుక బస్తాలు వేయించి మరమ్మతులు చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement