కాళోజీ సెంటర్: ఇంధన పొదుపుపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లాస్థాయి జాతీయ సైన్స్ సెమినార్–2026 శుక్రవారం నిర్వహించారు. ‘ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ – 2047: అవకాశాలు–సవాళ్లు’ అంశంపై 18 పాఠశాలల విద్యార్థులు ప్రజంటేషన్లు ఇచ్చారు. జెడ్పీహెచ్‌ఎస్ మామునూరు క్యాంపునకు చెందిన సహస్ర (గైడ్ టీచర్ అనితాలత) ప్రథమ బహుమతి, గీసుకొండ మండలం వంచనగిరిలోని తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన హుమెరా ఫిర్దౌస్ ద్వితీయ, ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఎ.నైషిక తృతీయ బహుమతి సాధించారు. హరిప్రియ, సీహెచ్ రశ్విత కన్సోలేషన్ బహుమతులు పొందారు. విజేతలకు లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో షీల్డులు, విద్యాశాఖ తరఫున ప్రశంసపత్రాలు అందజేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన సహస్ర ఈ నెల 29న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సెమినార్‌లో పాల్గొంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కట్ల శ్రీని వాస్ మాట్లాడుతూ 2047 నాటికి విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో ఇంధన పొదుపు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధన సామర్థ్యంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. ఇలాంటి సెమినార్లు విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సురేశ్‌బాబు, హెచ్‌ఎం శ్రీనివాసరావు, సైన్స్ టీం సభ్యులు రాంగోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రవణ్, పరమేశ్వర్ పాల్గొన్నారు.
జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్


