శుక్రవారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 25 2026 2:35 AM | Updated on Sep 25 2026 2:35 AM

– IIలోu

న్యూస్‌రీల్‌

సెప్టెంబర్‌ 24: కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో వయోవృద్ధుల హక్కులు, సంక్షేమంపై అవగాహన కార్యక్రమం ప్రారంభం

సెప్టెంబర్‌ 25: జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక, పట్టణ, బస్తీ దవాఖానల్లో వయోవృద్ధులకు కంటి పరీక్షలు, అన్ని వృద్ధాశ్రమాల్లో ఆటవిడుపు కార్యక్రమాలు

సెప్టెంబర్‌ 26: జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ డే కేర్‌ సెంటర్‌లో వృద్ధాశ్రమాల సామర్థ్య నిర్మాణం, పర్యవేక్షణ, రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరణ, కనీస ప్రమాణాలపై అవగాహన

సెప్టెంబర్‌ 28: హనుమకొండ ప్రణాం రెడ్‌క్రాస్‌ డే కేర్‌ సెంటర్‌లో ఆర్థిక భద్రత, డిజిటల్‌ అక్షరాస్యత, పెన్షన్‌, బ్యాంకింగ్‌ భద్రత, యూపీఐ చెల్లింపులు, సైబర్‌ మోసాలపై అవగాహన

సెప్టెంబర్‌ 29: శాయంపేట మండల కేంద్రంలో అంతర్జాతీయ బంధం, అభ్యసన దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం

సెప్టెంబర్‌ 30: వాకథాన్‌తో పాటు యోగా, ప్రాణాయామంపై అవగాహన కార్యక్రమాలు

అక్టోబర్‌ 1: కలెక్టర్‌ సమావేశ హాల్‌లో జిల్లా స్థాయిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమం

వయోవృద్ధులు తమ జీవితానికి మార్గదర్శకులు

వారాంతపు కార్యక్రమాల వివరాలు

ప్రతీ తల్లిదండ్రికి తమ కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు ఉన్నతస్థానానికి ఎదిగితే ఆ విజయం చూసి మురిసిపోవడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. కూతురితో గడిపిన ప్రతీ విషయం ఓ తీపిజ్ఞాపకం. మీకూ అలాంటి తీపి జ్ఞాపకాలు, మీ కూతురు గొప్పతనం గురించి డాటర్స్‌ డే (కూతురు దినోత్సవం) సందర్భంగా ‘సాక్షి’ తో పంచుకోండి. దీంతోపాటు తల్లిదండ్రి తమ కూతురుతో దిగిన సెల్ఫీఫొటో, మీ పేరు, ప్రాంతం వివరాలను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా కింది వాట్సాప్‌ నంబర్‌కు పంపండి. వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి 27వ తేదీ పత్రికలో ప్రచురిస్తాం.

● హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: వయోవృద్ధులు తమ జీవితానికి మార్గదర్శకులని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈనెల 24 నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు నిర్వహించనున్న వారాంతపు అవగాహన కార్యక్రమాలపై కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంఘాల ప్రతినిధులతో కలెక్టర్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ షెడ్యూల్‌ ప్రకారం అన్ని కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతీ వృద్ధాశ్రమంలోని వయోవృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, వద్ధాశ్రమాలను సంబంధిత అధికారులు సందర్శించాలన్నారు. యోగా, ప్రాణాయామంపై అవగాహన కల్పించడంతో పాటు క్యారమ్స్‌, చెస్‌, పాటల పోటీలు నిర్వహించి వయోవృద్ధుల్లో ఉత్సాహాన్ని నింపాలని చెప్పారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం –2007, నిబంధనలు –2011కు సంబంధించిన సమాచారంతో ఫోమ్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని వయోవృద్ధుల కేంద్రాలు పాటిస్తున్న కనీస ప్రమాణాలు, సంబంధిత నివేదికలను సత్వరమే అందించాలని కోరారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల సమాచార సంచిక వాల్‌పోస్టర్లను కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.విశ్వజ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ టి.మద్‌న్‌మోహన్‌ రావు, ఏడీఆర్డీఓ వెంకటేశ్‌, జీసీడీఓ ఎస్‌.సునీత, ఏసీపీ సదయ్య, సీడీపీఓలు వి.సింధూరాణి, సీహెచ్‌.అవంతి, ఎస్సై శ్రావణి, సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కమిటీ సభ్యులు దేవాచారి, చంద్రమౌళి, ధర్మరాజు, ఇన్‌చార్జ్‌ డీసీపీఓ ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, ఎఫ్‌ఆర్‌ఓ రవికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఫిరాయింపుల వివాదం!

మళ్లీ

తెరపైకి

సాక్షిప్రతినిధి, వరంగల్‌: పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఉమ్మడి వరంగల్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు వేసిన అనర్హత వేటు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్‌ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన వ్యవహారంలో కడియం శ్రీహరితోపాటు దానం నాగేందర్‌పై కూడా అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఇద్దరి విషయంలోనూ విచారణ జరిపి, వారి వాదనలు స్వీకరించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ గత మార్చి 11న ఇద్దరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఫిరాయింపునకు సంబంధించి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీంతో కడియం శ్రీహరి వ్యవహారానికి అప్పట్లో తెరపడినట్లయింది.

‘కడియం’పై ఆ ప్రభావం ఎంత?

మార్చి 11న స్పీకర్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం సెప్టెంబర్‌ 18న తెలంగాణ హైకోర్టు స్పీకర్‌ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించింది. 2024 ఏప్రిల్‌ 23నుంచి ఆయన అసెంబ్లీ సభ్యత్వం రద్దయినట్లుగా కోర్టు పేర్కొంది. ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా కూడా ప్రకటించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దానం నాగేందర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా గురువారం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. అదే రోజు స్పీకర్‌ కొట్టివేసిన కడియం శ్రీహరి అనర్హత పిటిషన్‌ విషయంలోనూ తదుపరి న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మొదలైంది.

మీరు పంపాల్సిన వాట్సాప్‌ నంబర్‌ : 99483 93391

నిమజ్జనానికి వరంగల్‌లోని చిన్నవడ్డేపల్లి చెరువుకు తరలుతున్న వినాయక విగ్రహాలు

వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో రెండో రోజు గురువారం వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది. భారీ వర్షం, హనుమకొండలోని చెరువుల్లో నీటి కొరత కారణంగా చిన్నవడ్డేపల్లి చెరువుకు భారీగా విగ్రహాలను తరలించి నిమజ్జనం చేశారు. బుధవారం మధ్యాహ్నం మొదలైన ఈ ప్రక్రియ గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మహానగర వ్యాప్తంగా 50 శాతానికిపైగా భారీ విగ్రహాలు జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాల మేరకు వరంగల్‌లోని చిన్నవడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత, గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ టి.వెంకన్న ఆయా ప్రాంతాల్లో నిమజ్జన తీరును పర్యవేక్షించారు. వరంగల్‌ ఉర్సు రంగసముద్రం, కట్టమల్లన్న, ఖిలా వరంగల్‌ అగర్తల, హనుమకొండలోని సిద్ధేశ్వర గుండం, కాజీపేట బంధం చెరువు, విలీన గ్రామాల్లో మధ్యాహ్నం నుంచి మార్నాడు తెల్లవారుజాము వరకు నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యింది. వరంగల్‌ మహానగర వ్యాప్తంగా సూమారు 8 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లు బల్దియా, రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజేశ్‌, ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు నిమజ్జన ప్రదేశాల్లో ఏర్పాట్లు పర్యవేక్షించారు.

రెడ్‌క్రాస్‌ ఎన్నికలకు 19 నామినేషన్లు

హన్మకొండ అర్బన్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ హనుమకొండ జిల్లా ఎన్నికల్లో భాగంగా గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహించారు. సుబేదారిలోని రెడ్‌క్రాస్‌ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరించారు. ఎన్నికల పరిశీలకుడు, ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) బి.శేషాద్రి, ఎన్నికల అధికారి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ బి.నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 19 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. నామినేషన్ల పరిశీలన శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులు పరిశీలన ప్రక్రియకు హాజరు కావాలని సూచించారు.

దానం తర్వాత.. కడియం సంగతేంటి?

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌

దానంపై హైకోర్టు వేటును సమర్థించిన సుప్రీం..

మార్చి 11న ఇద్దరినీ అనర్హతనుంచి తప్పించిన స్పీకర్‌

స్పీకర్‌ తీర్పుతో శ్రీహరికి అప్పట్లో ఊరట.. తాజాగా మళ్లీ చర్చ

‘కడియం’పై చేసిన

ఫిర్యాదులేంటి?

2023, డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌నుంచి కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 2024 మార్చి 31న సీఎం రేవంత్‌రెడ్డి, అప్పటి తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీల సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నట్లు బీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్‌ వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. కడియం శ్రీహరి పార్టీ మార్పు, కుమార్తె తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రచారం చేయడం, బీఆర్‌ఎస్‌ కేసీఆర్‌ తదితరులపై చేసిన విమర్శలు కూడా అప్పట్లో బీఆర్‌ఎస్‌ అనర్హత పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించిన అంశాల్లో ఉన్నాయి. ఇలా దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్ల విచారణలో స్పీకర్‌ పలు దఫాలు వాదనలు విని.. ఇరు పక్షాల వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వ్‌ చేసి.. చివరకు మార్చి 11న ఒకే రోజు ఇద్దరిపై ఉన్న పిటిషన్‌లను కొట్టి వేశారు.

జలవనరుల వద్ద బారులుదీరిన

వాహనాలు

ట్రైసిటీలో 50 శాతానికిపైగా ప్రతిమలు చిన్నవడ్డేపల్లి చెరువుకు..

పర్యవేక్షించిన సీపీ శ్వేత,

కమిషనర్‌ టి.వెంకన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement