కాశిబుగ్గ: జిల్లాలోని ప్రైవేట్ ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి ఆదేశించారు. వరంగల్ వెంకట్రామ జంక్షన్‌లోని సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్–2010, 2022 నిబంధనల అమలు, వివిధ రికార్డులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించడంతోపాటు ఎస్‌టీపీ, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లను తనిఖీ చేశారు. అలాగే, డయాగ్నోస్టిక్స్ విభా గం, జనరల్ వార్డులు, ఐసీయూలను పరిశీలించి, పేషంట్లకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ మాట్లాడుతూ టారిఫ్ బోర్డులో ప్రదర్శించిన ఫీజుల మేరకు పేషంట్లను నుంచి చార్జీలు వసూలు చేయాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పేషంట్లకు అవసరమైన డయాగ్నోస్టిక్ పరీక్షలను మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా హాస్పిటల్‌లో అందిస్తున్న సేవలు, టారిఫ్‌లు, వైద్యులు, సిబ్బంది వివరాలను కౌంటర్ వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు. స్కానింగ్ నిర్వహించే హాస్పిటల్స్, స్కానింగ్ కేంద్రాలు తప్పకుండా పీపీఎన్‌డీటీ యాక్ట్ 1994 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఈ చట్టం ప్రకారం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నిషేధమని, ఎవరైనా చేసినా, ప్రోత్సహించినా, చేయమని అడిగినా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా, 3 నెలల నుంచి 5 నెలల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఆయన వెంట స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రసన్నకుమార్, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, నాగరాజు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి
సంరక్ష హాస్పిటల్ లో తనిఖీ


