ఈదురు గాలులు, వాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఈదురు గాలులు, వాన బీభత్సం

Sep 24 2026 2:48 AM | Updated on Sep 24 2026 2:48 AM

హన్మకొండ: వరంగల్‌ జిల్లాలో ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం భీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి ఒక వైపు గణపతి నిమజ్జనం కొనసాగుతుండగా.. మరో వైపు ఈదురు గాలులు, వర్షం ఆటంకాలు సృష్టించాయి. రాత్రి 9 గంటల వరకు ఆటోమేటిక్‌ వెథర్‌ స్టేషన్‌లో నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం.. గీసుకొండలో 48 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గొర్రెకుంటలో 38.5, సంగెంలో 43.3, కాపులకనపర్తిలో 37.3, వరంగల్‌ పైడిపల్లిలో 39.5, ఏనుగల్‌లో 36, ఉర్సులో 31.8, కాశిబుగ్గలో 30, చెన్నారావుపేటలో 28.8, కల్లెడలో 25.3, వర్ధన్నపేటలో 28.3, దుగ్గొండిలో 23.5, మంగళవారిపేటలో 20, రెడ్లవాడలో 27.5, నల్లబెల్లిలో 19, మేడపల్లిలో 18.5, నెక్కొండలో 13.8, రాయపర్తిలో 11.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

న్యూశాయంపేట: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, లోతట్టు ప్రాంతాలు, చెరువులు, వాగుల, నాలాల సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004253424, 9154252936 నంబర్‌లో సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు.

నేడు విద్యాసంస్థలకు సెలవు

భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించినందున జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సెలవు ప్రకటించినట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు.

పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు, విరిగిపడిన కొమ్మలు

గంటల కొద్ది విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement