అర్హులకు సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులకు సంక్షేమ పథకాలు

Sep 24 2026 2:48 AM | Updated on Sep 24 2026 2:48 AM

నర్సంపేట: కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులకు సంక్షేమ పథకాలను అందజేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు నర్సంపేట పట్టణం, నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం మండలాలకు చెందిన 146 మంది లబ్ధిదారులకు బుధవారం రూ.1.46 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఉమారాణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మీరామానంద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాలాయి శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌లు బొబ్బాల రమణారెడ్డి, తోకల శ్రీనివాస్‌రెడ్డి, చెన్నూరు కిరణ్‌రెడ్డి, కంకల ప్రసాద్‌, రఘుపతిరావు, వల్లే శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ హరిబాబు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గంధం నరేందర్‌, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement