కాళోజీ సెంటర్: ఈనెల 27న (ఆదివారం) నిరక్షరాస్యులకు నిర్వహించనున్న ఉల్లాస్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వైవీ గణేశ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమ్యూనిటీ ఆర్గనైజర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని, ఒక్కో అభ్యర్థికి రెండు గంటల సమయం కేటాయించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డీఆర్‌డీఏ, మెప్మా సిబ్బందికి సహకరించాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు మాట్లాడుతూ మండల విద్యాశాఖ అధికారుల ద్వారా ప్రధానోపాధ్యాయులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ రమేష్‌రెడ్డి, డీఎంసీ రేణుక, ఉల్లాస్ ఇన్‌చార్జ్ నాగేశ్వరరావు, టాస్క్ కోఆర్డినేటర్ సదానందం, ఏపీఎం రమేష్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ వైవీ గణేశ్


