ఎల్కతుర్తిలో న్యాయ విజ్ఞాన సదస్సు | - | Sakshi
Sakshi News home page

ఎల్కతుర్తిలో న్యాయ విజ్ఞాన సదస్సు

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

ఎల్కతుర్తి: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సులో జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి నేరెళ్ల వెంకట హైమ పూజిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేయడం చట్టరీత్య నేరమని, అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండాకే పెళ్లిళ్లు చేయాలని సూచించారు. సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కోర్టుల చూట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకోవద్దని సూచించారు. అంతకుముందు ఆమె స్థానిక వీరభద్రస్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీడీఓ విజయ్‌కుమార్‌ అధ్యక్షత వహించిన ఈసదస్సులో సర్పంచ్‌ మునిగడుప లావణ్య–శేషగిరి, డిప్యూటీ తహసీల్దార్‌ రమేశ్‌, కార్యదర్శి శ్రీనివాస్‌, డిఫెన్స్‌ లాయర్‌ రవి, ఎస్సై నరసింహారావు, ఉపసర్పంచ్‌ రాజు, తదితర మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement