ఆదిలాబాద్ రిమ్స్ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత, ఫైర్ ప్రివెన్షన్‌న్ ఆడిట్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో ఎంజీఎంలో ఫైర్ అలారం వ్యవస్థ, ఫైర్ ఎక్స్‌టింగ్విష్టర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, విద్యుత్ వైరింగ్, జనరేటర్, ఏసీ యూనిట్లు, ఎలక్ట్రికల్ లోడ్, వార్షిక ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్ జరుగుతున్నాయా? లేవా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెద్దల వార్డులతో పోలిస్తే నవజాత శిశు విభాగం పరిస్థితి పూర్తిగా భిన్నం. నడవలేని, స్వయంగా బయటకు రాలేని పసికందులు ఇంక్యుబెటర్లు, వార్మర్లలో ఉంటారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వారిని పరికరాలతో సహా సురక్షిత ప్రాంతానికి తరలించాలి. అందుకే వైద్య పరికరాల లభ్యతతోపాటు అత్యవసర తరలింపు ప్రణాళిక కూడా కీలకమని, ఏదైనా ప్రమాదం జరిగినా వారిని ప్రాణాలతో బయటకు తీసుకెళ్లడం ముఖ్యమని వైద్యవర్గాలంటున్నాయి. దీనిపై ఎంజీఎం ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


